Minister Narayana: ఆక్రమించిన భూములను స్వచ్ఛందంగా తిరిగిచ్చేయండి: మంత్రి నారాయణ మాస్ వార్నింగ్

వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు ఆక్రమించిన భూములను స్వచ్ఛందంగా తిరిగి సర్కార్‌కు అప్పగించాలని మంత్రి నారాయణ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-08-27 05:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు ఆక్రమించిన భూములను స్వచ్ఛందంగా తిరిగి సర్కార్‌కు అప్పగించాలని మంత్రి నారాయణ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయ్యాయని అన్నారు. మాజీ సీఎం జగన్ ఇంటిని వదిలి బయటకు రాలేదని, దీంతో ఎమ్మెల్యేలు, మంత్రలు వాళ్ల ఇష్టానుసారంగా వ్యహరించారని ధ్వజమెత్తారు. మునిసిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.454 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలు, పార్క్‌ల ఆక్రమణలను వదిలిపెట్టకపోతే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ‘హైడ్రా’ తరహాలో ఓ సంస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. సెప్టెంబర్ 13న మరో 70 అన్నా క్యాంటీన్లను ప్రారంభించబోతున్నామని తెలిపారు. విశాఖలో ఉన్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌‌ను కూడా అధునీకరిస్తామని వెల్లడించారు. వచ్చే నెలాఖరులోగా టీడీఆర్ బ్లాండ్లపై కూడా స్పష్టత రానుందని తెలిపారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని, అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.


Similar News