బుడమేరుకు మళ్లీ వరద అంటూ వదంతులు.. స్పందించిన మంత్రి నారాయణ

బుడమేరు(Budameru)కు మళ్లీ వరద అంటూ కొందరు వదంతులు వ్యాప్తి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో విజయవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

Update: 2024-09-14 16:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుడమేరు(Budameru)కు మళ్లీ వరద అంటూ కొందరు వదంతులు వ్యాప్తి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో విజయవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఈ వదంతులపై మంత్రి నారాయణ(Minister Narayana) స్పందించారు. బుడమేరు కట్ట మళ్లీ తెగిందనడం అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విజయవాడ పూర్తి సురక్షితంగా ఉందని అన్నారు. ఎవరూ వదంతులను నమ్మొద్దని సూచించారు. అంతేకాదు.. వదంతులపై జిల్లా కలెక్టర్ సైతం స్ట్రాంగ్‌గా స్పందించారు.

బుడమేరు కట్టపై పుకార్లను నమ్మొద్దని ప్రజలను కోరారు. వదంతులు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుడమేరులో ప్రమాదకర స్థాయిలో నీళ్లు లేవన్నారు. బుడమేరుకు మళ్లీ వరద వస్తే ముందుగానే సమాచారం అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకుని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. బుడమేరు ప్రాంత ప్రజలకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని.. ధైర్యంగా ఉండాలని కలెక్టర్ చెప్పారు.


Similar News