తాడేపల్లి ప్యాలెస్ ఇనుపకంచెకు అన్ని కోట్లా ? : ఎక్స్ లో మంత్రి లోకేశ్ పోస్ట్

తాడేపల్లి ప్యాలెస్ కు జగన్ వృథాగా ఖర్చు చేసిన ప్రజాధన వివరాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఫెన్సింగ్ కోసం ఏకంగా రూ.13 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు.

Update: 2024-10-16 08:49 GMT

దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లి ప్యాలెస్ (Tadepally Palace) కోసం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఖర్చు చేసిన లెక్కల వివరాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాడేపల్లి ప్యాలెస్ కు ఇనుప కంచె వేసేందుకు అక్షరాలా రూ.12.85 కోట్లను స్వాహా చేశారని ఆరోపించారు. ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల మేర ఇనుప కంచె నిర్మాణానికి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. తన స్వార్థం కోసం జగన్ అర్జెంట్ సెక్యూరిటీ పేరు చెప్పి.. ఖర్చు చేసిన టన్నుల కొద్దీ ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. 2021, జులై 19న ప్యాలెస్ ఫెన్సింగ్ కు సంబంధించిన ప్రొటోకాల్ లెటర్ ను లోకేశ్ షేర్ చేశారు. 


Similar News