‘గతంలో తప్పు చేసిన అధికారులను వదిలేదే లేదు’: మంత్రి నారా లోకేశ్

కేబినెట్‌ భేటీలో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-28 11:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేబినెట్‌ భేటీలో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తప్పు చేసిన అధికారులను ఎవరిని వదిలేదే లేదని మరోసారి హెచ్చరించారు. తప్పులు చేసిన వారందరి పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయని అన్నారు. రాజధాని పరిధిలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎవరి పైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని తెలిపారు. ఆరోగ్య శ్రీ పై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు ఉంటాయని మంత్రి నారా లోకేశ్ నొక్కి చెప్పారు. ఇక కేబినెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ రేంజ్‌లో ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచి పేరు దెబ్బతింటోందని మండిపడ్డారు. పేపర్ల నిండా వారు చేస్తున్న పొరపాట్లు ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయని ధ్వజమెత్తారు. దీనివల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందని ఫైర్ అయ్యారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


Similar News