AP NEWS:కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పై మంత్రి నాదేండ్ల కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయింది. ఈ క్రమంలో పలువురు మంత్రులు, అధికారులు కూటమి వంద రోజుల పాలన పై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

Update: 2024-09-22 13:46 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయింది. ఈ క్రమంలో పలువురు మంత్రులు, అధికారులు కూటమి వంద రోజుల పాలన పై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు హామీల అమలు పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి 100 రోజుల పాలన పై మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలన చాలా బాగుందని తెలిపారు.

ప్రజలు ఏం కోరుకున్నారో అలాంటి పాలన అందించడంలో ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు విజన్‌కు తోడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతన ఆలోచనలతో ప్రజలు కోరికలు అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. తెనాలిలో వంద రోజుల్లో గంజాయిని అరికట్టడంతో పాటు, 80 శాతం గంజాయిని నిర్మూలించమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. త్వరలో ప్రజలు సమస్యలు పరిష్కారం కోసం వాట్సాప్ నెంబర్‌ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి నాదేండ్ల వెల్లడించారు.


Similar News