AP:దివ్యాంగ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్

ఏపీలో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించింది.

Update: 2024-07-07 12:33 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా టీడీపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ ద్వారా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దివ్యాంగ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. ఇంటర్ మార్కుల జాబితాలో దివ్యాంగ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక జీవో విడుదల చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు సాధించిన విజయవాడకు చెందిన సత్యదేవ్..ఇంటర్ సర్టిఫికెట్ విషయంలో ఎదురైన సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఆ సమస్య ఏంటంటే..సత్యదేవ్ మెమోలో కేవలం 4 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని..మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బీలను ఒకే సబ్జెక్ట్‌గా పరిగణిస్తున్నామని, అందువల్ల ఇంటర్మీడియట్ పత్రాన్ని అంగీకరించబోమని మద్రాస్ ఐఐటీ తెలిపింది. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ పృధ్వీ సత్యదేవ్‌కు ఐఐటీ మద్రాసులో జీఓ విడుదలతో సీటు కేటాయించారు. ఈ జీఓతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25 మంది దివ్యాంగ విద్యార్థులకు IIT, NIT, ట్రిపుల్ IT వంటి విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. ఈక్రమంలో ఐఐటీలో సీటు కోసం సర్టిఫికేట్‌తో 'E' (EXEMPTION) స్థానంలో నిర్ధిష్ట సంఖ్య ఉండాలని కళాశాల అధికారులు తెలిపారు.


Similar News