Vijaywada: పీజీ అడ్మిషన్లలో పెనాల్టీలు.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన

విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల గడువు ముగియడంతో దరఖాస్తుల స్వీకరణకు విద్యార్థుల నుంచి అధికారులు రూ. 20 వేలు పెనాల్టీ వసూలు చేస్తున్నారు..

Update: 2024-10-05 17:34 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల గడువు ముగియడంతో దరఖాస్తుల స్వీకరణకు విద్యార్థుల నుంచి అధికారులు రూ. 20 వేలు పెనాల్టీ వసూలు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దరఖాస్తు ఫీజు కంటే పెనాల్టీనే ఎక్కువగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పెనాల్టీ లేకుండా దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆల్ ఇండియా స్థాయిలో పీజీ అడ్మిషన్ల షెడ్యూల్ ఇంకా రాకపోయినా హెల్త్ యూనివర్సిటీ అధికారులు హడావుడి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్వీనర్ కోటా అడ్మిషన్లను ముందుగా ఎందుకు ముగిస్తున్నారని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఎన్ని పీజీ సీట్లు ఉన్నాయో ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించకుండానే దరఖాస్తుల స్వీకరణ గడువు ముగించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. 


Similar News