Minister Kollu Ravindra: వాళ్లు దోచుకున్నారు.. మేం ఫ్రీ గా ఇస్తున్నాం

కూటమి ప్రభుత్వ పథకాలను పేదలకు పూర్తిస్థాయిలో అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నేటి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చని చెప్పారు.

Update: 2024-10-29 08:45 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం దీపావళి కానుకగా ఉచిత సిలిండర్లను అందిస్తోందని మంత్రి కొల్లురవీంద్ర (Minister Kollu Ravindra) పేర్కొన్నారు. నేటి నుంచే ఉచిత సిలిండర్ల (Free Gas Cylinder Booking) కోసం బుక్ చేసుకోవచ్చన్నారు. మంగళవారం సింహాచలం అప్పన్నను (Simahachalam Temple) దర్శించుకున్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో మైనింగ్ మాఫియాను దోచుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని తమ ప్రభుత్వం చేయదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి రూ.12 వేల కోట్లను తీసుకొచ్చామని తెలిపారు.

వైసీపీ హయాంలో ఇసుకను దోచుకున్నారని, తమ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇసుకను అందిస్తుందన్నారు. అవసరమైనవారు రవాణా ఛార్జీలు చెల్లించి ఇసుకను బుక్ చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు. ఉత్తరాంధ్రలో ఇంకా చిన్న చిన్న సమస్యలున్నాయని, వాటిని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఖనిజాల తవ్వకాన్ని పెంచి.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల కలెక్టర్లపై కూడా కేసులు వేశారన్న మంత్రి.. అవినీతికి పాల్పడిన ఎవరినీ వదలమని హెచ్చరించారు. 

Tags:    

Similar News