ఆ స్టిక్కర్ మాది కాదు.. పోలీసులకు మంత్రి కాకాని పీఏ ఫిర్యాదు

బెంగళూరు రేవ్ పార్టీలో కారుకు ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ తమ ప్రమేయం లేకుండా వాడుకున్నారని పోలీసులకు మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి పీఏ ఫిర్యాదు చేశారు..

Update: 2024-05-20 13:12 GMT

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 101 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే రేవ్ పార్టీ నిర్వహించిన చోట ఏపీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ కారు కలకలం రేపింది. దీంతో మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి లేదా, ఆయనకు సంబంధించిన వాళ్లు రేవ్ పార్టీలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై స్పందించిన కాకాని పీఏ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ స్టిక్కర్‌తో తమకు సంబంధంలేదని.. ఆ రేవ్ పార్టీలో తమ వాళ్లు లేరని తెలిపారు. అసలు ఆ స్టిక్కర్ ఎలా వచ్చిందో తెలియదన్నారు.  దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని పోలీసులను మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి పీఏ కోరారు.

అంతుకుముందు మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ రేవ్ పార్టీలో దొరికిన కారుతో కానీ, ఓనర్‌తో గానీ, అందులో ప్రయాణించిన వాళ్లతో గాని తమకు సంబంధం లేదని తెలిపారు. ఆ కారు రిజిస్ట్రేషన్ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పేరుతో ఉందని, అతనితో తనకు పరిచయం లేదన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కావాలనే తనపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తన ప్రమేయం లేకుండానే ఎమ్మెల్యే స్టిక్కర్ వినియోగించారని, పోలీసులకు ఫిర్యాదు చేశామని మంత్రి కాకాని పేర్కొన్నారు.


Similar News