పవన్ కల్యాణ్ చంద్రబాబుకు పాలేరు: మంత్రి జోగి రమేష్ ఫైర్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఏం చేయడానికైనా సిద్ధమే అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఏం చేయడానికైనా సిద్ధమే అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌పై వైసీపీ నాయుకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మంత్రి జోగి రమేష్ జనసేన చీఫ్‌పై విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు పాలేరుగా ఉన్నాడని అన్నారు. జనసేన పార్టీని పవన్ కల్యాణ్ చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. ఎంతమంది కలిసి వచ్చినా.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఇక, జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
Mangalagiri: వాళ్లకు రూ. కోటి ఖర్చు చేస్తున్నా... పార్టీ సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు