Amaravati: డిసెంబర్ మొదటి వారం నుంచే విశాఖ కేంద్రంగా పాలన

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ మొదటి వారం నుంచి విశాఖ నుంచి పాలన సాగిస్తారని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు...

Update: 2023-11-24 13:39 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ మొదటి వారం నుంచి విశాఖ నుంచి పాలన సాగిస్తారని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన పాలన వికేంద్రీకరణలో భాగంగా సీఎం జగన్ విశాఖను పాలన రాజధానిగా ప్రకటించారని ఆయన తెలిపారు. విశాఖ రాజధాని అనేది ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. 50 సంవత్సరాల క్రితమే విశాఖను రాజధాని చేయాలని అప్పటి నేతలు భావించారని గుర్తు చేశారు. పాదయాత్రలో ఉత్తరాంధ్ర వెనుకబాటును సీఎం జగన్ గుర్తించారని, అందుకే పాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖను అభివృద్ధి చేయాలని నిర్ణయించారని మంత్రి అప్పలరాజు వెల్లడించారు.


ఓ వైపు ప్రతిపక్షాలు కోర్టులో వేసిన కేసులతో పోరాటం చేస్తూనే సీఎం జగన్ మరోవైపు పరిపాలన, సమీక్షలు చేయడానికి కార్యాలయాలు చూశారని తెలిపారు. విశాఖలో మిలీనియ టవర్స్, రుషికొండ గెస్ట్ హౌస్‌లను కబ్జా చేశామని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ ఆస్తులేమైన వాళ్ల బాబు సంపాదించినవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్రా ప్రజలను నిర్దేశిస్తారా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర టీడీపీ, జనసేన నేతలకు ఇంత బానిసత్వం అవసరమా అని మంత్రి అప్పలరాజు వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News