వైఎస్ షర్మిలపై మంత్రి అంబటి రాంబాబు సంచలన ట్వీట్... క్షణాల్లో వైరల్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఊపిరిలూదేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-01-16 13:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఊపిరిలూదేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవలే వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆ పార్టీలో చేరిన దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వై.ఎస్ షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ నేతలు షర్మిలను పీసీసీ చీఫ్‌గా నియమించడం పట్ల ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా మంత్రి అంబటి రాంబాబు X (ట్విట్టర్) వేదికగా ‘Dr. YSR, AP Congress.. కీ౹౹శే.. లే!’ అని కామెంట్ చేశారు. దివంగత నేత చనిపోవడంతోనే కాంగ్రెస్ రాష్ట్రం పాతాళానికి పడిపోయిందని అన్నారు. ఇక రాష్ట్ర విభజన తరువాత కనుమరుగైందంటూ సెటైర్లు వేశారు. ఇక మరో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. అసలు రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షురాలు అయితే మాకేంటని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.  

Tags:    

Similar News