Ap Assembly: చంద్రబాబుపై మంత్రి అమర్‌నాథ్ సంచలన ఆరోపణలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది.....
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అంశంపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని పోలీసులు కేసు నమోదు చేసి పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది.
తాజాగా మంత్రి అమర్‌నాథ్ అసెంబ్లీలో మాట్లాడుతూ రూ.3,356 కోట్లు ప్రాజెక్ట్ అని చెప్పి మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల ధనాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్వినియోగం చేశారని ఆయన చెప్పారు. ఈ స్కామ్‌తో తమకు సంబంధం లేదని ఇప్పటికే సీమెన్స్ చెప్పిందని తెలిపారు. షెల్ కంపెనీల ద్వారా మనీలాడరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. సీబీఐ, ఈడీ స్కిల్ స్కాంపై దర్యాప్తు చేస్తోందని మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు.