పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం

పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో లారస్ ఫార్మా కంపెనీలో సోమవారం జరిగిన ప్రమాదంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2022-12-27 08:30 GMT

దిశ, ఉత్తరాంధ్ర: పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో లారస్ ఫార్మా కంపెనీలో సోమవారం జరిగిన ప్రమాదంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించగా, మరొక కార్మికునికి తీవ్రంగా గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద వివరాలను తెలుసుకున్న ఆయన ఇక్కడ పరిస్థితి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారని అమర్నాథ్ తెలియజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరో కార్మికులకు వైద్య సహాయం అందించాలని అమర్నాథ్ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని మంత్రి అమర్నాథ్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.


Similar News