Viral News: షాక్ కొడుతున్న ఏప్రిల్ కరెంటు బిల్లులు

కరెంటు వైర్‌ను ముట్టుకోవాల్సిన పనిలేదు కరెంటు బిల్లు పట్టుకుంటే చాలు షాక్ కొడుతుంది అని ఆంధ్రా ప్రజలు అంటున్నారు.

Update: 2024-04-11 08:01 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: కరెంటు వైర్‌ను ముట్టుకోవాల్సిన పనిలేదు కరెంటు బిల్లు పట్టుకుంటే చాలు షాక్ కొడుతుంది అని ఆంధ్రా ప్రజలు అంటున్నారు. ఏప్రిల్ మాసం బిల్లులు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సహజంగానే వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా వుండి బిల్లులు ఎక్కవ వస్తుంటాయి.

ఎక్కువ సేపు ఫ్యాన్‌లు వేయడం, ఏసీలు వాడడం , ఇల్లలో ఎక్కువ సేపు ఉండడం, పరీక్షల సమయం కావడం వంటి కారణాల వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుందని తలచి.. తాము వినియోగించిన విద్యుత్ కు బిల్లు కాస్త ఎక్కవే వస్తుందని ముందుగానే ప్రిపేర్ అయ్యే వినియోగ దారులు, కొత్తగా ట్రూ అప్ చార్జీలు భారీగా పెరగడం చూసి షాక్ అయ్యారు.

ట్రూ అప్ ఛార్జీలను విద్యుత్ పంపిణీ సంస్ధలు ఎన్నికలకు నెల రోజుల ముందు భారీగా పెంచి వసూలు చేయడం ఏమిటో అర్ధం కావడం లేదని ప్రజలు  అంటున్నారు. ఓ వైపు ఎన్నికలను ద్రుష్టిలో వుంచుకొని కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌ల ధరలను తగ్గించింది.

పెట్రోలు , డీజీలు ధరలను కాస్త తగ్గించి పెరగకుండా చర్యలు తీసుకొంది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఉపశమన చర్యలు తీసుకోకపోగా ఎన్నికల వేళ భారీ వడ్డింపులలో విద్యుత్ బిల్లులు పంపడం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు సైతం ఇబ్బందికరంగా మారింది.

ఇక ఎవరు దొరుకుతారా అని గోతికాడ నక్కలా ఎదురు చూసే ట్రోలర్స్‌కి, ఆకలితో ఉన్న పులికి ఆహరం దొరికినట్లు కరెంటు అనే కంటెంట్ దొరికింది. దీనితో జగన్ బాదుడే... బాదుడు అనే శీర్షికతో నాకు షాక్ కొట్టింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ నెల మీకు కరెంటు బిల్లు ఎంత వచ్చింది? బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా? అని ప్రశ్నిస్తూ షాక్ కొడితే మీ కరెంటు బిల్లును సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై షేర్ చేయండి అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News