కుహనా మేధావులు ఏడవకండి.. మెగా బ్రదర్ నాగబాబు
సినిమాలు చూస్తే ప్రజలు చెడిపోతారని జరుగుతున్న ప్రచారంపై మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సినిమాలు చూస్తే ప్రజలు చెడిపోతారు అంటూ జరుగుతున్న ప్రచారంపై మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఘాటుగా స్పందించారు. సినిమాల్లో హింస వల్ల ప్రజలు చెడిపోతారంటే..మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల బాగుపడాలి కదా అంటూ లాజిక్‌గా ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టారు. 'సినిమాల్లో చూపించే వైలైన్స్ వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే ,మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా . ఒక ఫిల్మ్ మేకర్‌గా నా దృష్టిలో ఒకటి మాత్రం నిజం. సినిమాలు ఎంటర్‌టైనమెంట్ కోసమే. జనాన్ని బాగు చెయ్యటం కోసమో చెడగొట్టాడని కోసమో తేసేంత గొప్పవాళ్ళు లేరిక్కడ. ఇట్స్ జస్ట్ ఏ బిజినెస్. సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇది ఆన్సర్.సినిమాల్లో ఏదన్నా ఓవర్ గా ఉంటే సెన్సార్ ఉంది. కుహనా మేధావులు ఏడవకండి' అంటూ కొణిదెల నాగబాబు ఘాటుగా చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : గ్రానైట్ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని ఏపీ, తమిళనాడు సీఎస్‌లకు చంద్రబాబు లేఖ