Key Development: ఏపీలో భారీగా బదిలీలు

ఏపీలో రెండు ప్రభుత్వ శాఖల్లో భారీగా బదిలీలు చేపట్టారు.....

Update: 2024-09-22 12:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ (AP)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సవర్థవంతమైన పాలనపై సీఎం చంద్రబాబు (Cm Chandrababu) దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే బదిలీలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఆయా శాఖల్లో ఇష్టారాజ్యం నడిచిందనే ఆరోపణలపై ఉద్యోగుల (Employees)ను భారీగా బదిలీ చేశారు. తాజాగా మరో రెండు శాఖల్లో బదిలీలు (Transfers) చేపట్టారు. అటవీశాఖ(Forest Department)కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 13 మంది డీఎఫ్ఓలను బదిలీ చేశారు. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనంతరామ్(Special Chief Secretary Anantharam) ఆదేశాలు జారీ చేశారు. అటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ(Panchayat Raj, Rural Development Department)లోనూ బదిలీలు చేపట్టారు. ఏడుగురు డీఆర్డీఏ పీడీలను బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్(State Principal Secretary Shashi Bhushan) ఉత్తర్వులు జారీ చేశారు. 


Similar News