చాలా బాధ పడ్డా.. నాన్నకు చెబుతా.. మంచు మనోజ్ సంచలన ట్వీట్

తిరుపతి రూరల్ రంగంపేటలోని నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు...

Update: 2024-09-15 06:47 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి రూరల్ రంగంపేటలోని నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీ(Actor Manchu Mohan Babu University)లో అధిక ఫీజులు (High Fees) వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ఫీజులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఫీజుల విషయంలో నిబంధనలు పాటించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఐసీటీఈకి విద్యార్థుల తల్లిదండ్రులు(Students Parents) లేఖ రాశారు.

అయితే ఈ వివాదంపై మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ (Manchu Manoj) స్పందించారు. యూనివర్సిటీ ఈడీ వినయ్‌ను వివరణ కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలకు మద్దతు తెలిపారు. విద్యార్థుల ఆందోళనను బాధ పెట్టిందని, వెంటనే ఈ విషయాన్ని తన తండ్రి మంచు మోహన్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. రాయలసీమ వాసులు, విద్యార్థులశ్రేయస్సుకే మోహన్ బాబు ప్రాధాన్యత ఇస్తారని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు సందేశాలు ఉంటే mm.mbu0419@gmail.comకి ఈ-మెయిల్ పంపాలని విజ్ఞప్తి చేశారు.


Similar News