బంగాళాఖాతంలో అల్పపీడనం..కోస్తాంద్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన అల్పపీడనం బలపడుతుంది.

Update: 2024-08-29 08:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన అల్పపీడనం బలపడుతుంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని కారణంగా కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాల కారణంగా సముద్రంలో అలలు ఎగిసిపడుతాయని.. వాయుగుండం కారణంగా పెద్ద ఎత్తున అలలు వస్తాయని, సముద్రం అతలాకుతలంగా మారే అవకాశం ఉందని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


Similar News