శ్రీకృష్ణుడు, ఏసు ప్రభువు కూడా గొర్రెలు, ఆవులు కాచినవాళ్లే: మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్

స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరులో తొలిసారి బీసీని మంత్రిగా తనను ఎంపిక చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే చెల్లిందని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

Update: 2023-11-26 06:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరులో తొలిసారి బీసీని మంత్రిగా తనను ఎంపిక చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే చెల్లిందని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు గొర్రెలు కాచుకొనేవాళ్లని చాలా మంది ఎద్దేవా చేశారన్నారు. తన తండ్రి, తాత ముత్తాతలు గొడ్లు, ఆవులు కాచుకునేవాళ్లమని అది చెప్పుకునేందుకు ఎంతో గర్వపడుతున్నాం అని అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. మనం మొక్కే శ్రీకృష్ణుడు, ఏసు ప్రభువు కూడా గొర్రెలు, ఆవులు కాచినవాళ్లేనని చెప్పుకొచ్చారు. జగనన్న సారథ్యంలో పని చేస్తున్నందుకు తలెత్తుకొని బతుకుతున్నాం. గర్వంగా ఫీలవుతామని అన్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయం గుడి తెరిచేది యాదవులే. అది ఒక వరంగా భావిస్తానని అన్నారు. ఇలాంటి వరాన్ని 1996లో సన్నిధిగొల్లలకు వంశపారంపర్యం బాబు తీసేస్తే ఏం చేశారు? జగనన్న వచ్చాక మళ్లీ పునరుద్ధరించారన్నారు. మత్స్యకార సోదరులను చంద్రబాబు అవమాన పరిస్తే ఇదే తెగకు చెందిన వారిని రాజ్యసభకు పంపిన ఘనత వైఎస్ జగన్‌ది అని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికలు బలిసిన వాళ్లకు, బక్కచిక్కిన వాళ్లకు మధ్య జరుగుతున్న యుద్ధం. బలిసినోడి పక్కన బాబు, పవన్‌ ఉన్నారు. బక్కచిక్కిన వారి పక్కన జగనన్న ఉన్నాడు అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News