Lokeshది ఐరన్ లెగ్గా? ట్విట్టర్లో వైసీపీ, టీడీపీ వార్!
నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రకు సంబంధించిన రెండు ముఖ్య సందర్భాల్లోనూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రకు సంబంధించిన రెండు ముఖ్య సందర్భాల్లోనూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. యువగళం పోస్టరును విడుదల చేసిన రోజున కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించారు. తాజాగా, శుక్రవారం కుప్పంలో పాదయాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన నందమూరి తారకరత్న హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, లోకేశ్ ది ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జోరందుకుంది.
ఏకిపారేస్తున్న నెటిజన్లు..
లోకేశ్ పాదయాత్రకు సంబంధించి డిసెంబరు 28న యువగళం పోస్టర్‌ను విడుదల చేశారు. అదే రోజు సాయంత్రం నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు రోడ్డు షోలో భాగంగా భారీ బహిరంగ సభ జరిగింది. తోపులాటలో 8 మంది డ్రైనేజీలో పడి ప్రాణాలు కోల్పోయారు. నలుగురికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన యాదృచ్ఛికమే అయినా లోకేశ్ పాదయాత్ర పోస్టర్ విడుదల రోజునే చోటు చేసుకోవడంపై వైసీపీ సోషల్‌మీడియా ట్రోలింగ్ చేయడం మొదలైంది. 'పప్పు పులకేష్ పాదయాత్ర జనాల చావు యాత్రలా తయారయ్యేలా ఉంది...' అంటూ పాలేటి కృష్ణవేణి ట్వీట్ చేశారు. కొందరు వైసీపీ కార్యకర్తలు లోకేష్‌ది ఐరన్ లెగ్గంటూ రిట్వీట్ చేశారు. దీంతో ట్విట్టర్లో టీడీపీ, వైసీపీ సోషల్‌మీడియా వార్ తీవ్ర దుర్భాషలదాకా చేరింది. తాజాగా, తారకరత్న అస్వస్థతకు గురికావడంతో లోకేశ్‌పై సెటైర్లు, విమర్శలు మరింత జోరందుకున్నాయి.
Also Read...