ఇలా సెల్ఫీ దిగే దమ్ము నీకుందా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఆలూరు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది.
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఆలూరు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. అయితే దేవనకొండ చెరువు వద్దకు వెళ్లగానే లోకేశ్ సెల్ఫీ తీసుకుని సీఎం జగన్‌కు ఛాలెంజ్ విసిరారు. ఒకప్పుడు దేవనకొండ చెరువు ఎండిపోయి ఉండేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక హంద్రీ నీవా జలాలతో చెరువును లింక్ చేశాం. దీని వల్ల దేవనకొండ పట్టణానికి తాగునీరు సహా పల్లెదొడ్డి, గెద్దరాళ్ల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లకు పుష్కలంగా నీరు అందుతున్నాయి. ఇది మా ప్రభుత్వం ఘనత. జగన్ ఇలా సెల్ఫీ దిగే దమ్ము నీకుందా? అంటూ లోకేశ్ సవాల్ విసిరారు.