‘టీడీపీ కోటి సభ్యత్వం ఘనత లోకేష్‌దే’.. మంత్రి కీలక వ్యాఖ్యలు
టీడీపీ(TDP) 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రేపల్లే కార్యాలయంలో పార్టీ జెండాను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satya Prasad) ఆవిష్కరించారు.

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ(TDP) 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రేపల్లే కార్యాలయంలో పార్టీ జెండాను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satya Prasad) ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్(Sr.NTR) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఆనాడు పెట్టిన టీడీపీ చరిత్ర తిరగరాసిందని తెలిపారు.
బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించడమే కాక మహిళలను రాజకీయంగా చైతన్యవంతం చేసిన పార్టీ టీడీపీనే అన్నారు. జనవవస్త్రాలు, రెండు రూపాయల కిలో బియ్యం, పక్కా ఇళ్లు లాంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ తెలుగు ప్రజలకు మరింత సేవ చేసిందని మంత్రి పేర్కొన్నారు.

హైటెక్ సిటీని నిర్మించి విజన్-2020 తో రాష్ట్ర భవిష్యత్తును మార్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. యువ నేత లోకేష్ పార్టీ కార్యకర్తలకు అండదండగా నిలిచి ఐదు లక్షల రూపాయల బీమా కల్పించారు. మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) నాయకత్వంలో ఏ ప్రాంతీయ పార్టీ సాధించలేనటువంటి కోటి మంది సభ్యత్వాన్ని టీడీపీ సాధించిందని మంత్రి అనగాని పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ వేసిన పునాది, చంద్రబాబు చూపిన దశ దిశ, లోకేష్ నడిపిస్తున్న మార్గం టీడీపీని అత్యుత్తమ పార్టీగా నిలిపాయని తెలిపారు.
కూటమి ప్రభుత్వం(AP Government) పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు పీ4ను తీసుకువస్తున్నారని అన్నారు. అనాడు స్వర్గీయ ఎన్టీఆర్ కేంద్రంలో ఎలా కీలక పాత్ర పోషించారో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయకత్వంలో మన ఎంపీలు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తున్నారు. గత ఎన్నికల్లో మాకు 164 స్థానాలు ఇచ్చిన ప్రజల ప్రగతి కోసం అనేక సంస్కరణలు తీసుకురావడంతో పాటు అన్ని రకాల హామీలను నెరవేరుస్తామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ వ్యాఖ్యానించారు.