తండ్రి చంద్రబాబు రికార్డును బ్రేక్ చేసిన లోకేశ్
2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతుంది.
దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతుంది. వైసీపీని గద్దె దించేందుకు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలతో దూసుకెళ్ళిపోతున్నారు. మరోవైపు యువనేత, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రపేరుతో ఈ ఏడాది జనవరి నుంచి ప్రజల మధ్యే తిరుగుతున్నారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ లబిస్తుంది. ఎక్కడికక్కడ ప్రజలు లోకేశ్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు లోకేశ్ యువగళం పాదయాత్ర రికార్డులు సృష్టిస్తోంది.తాజాగా లోకేశ్ తన తండ్రి చంద్రబాబు నాయుడు పాదయాత్ర రికార్డును సైతం బ్రేక్ చేశారు. 2012లో 208 రోజుల్లో 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్రను చంద్రబాబు పూర్తి చేశారు. అయితే లోకేశ్ 206 రోజుల్లోనే 2,817 కి.మీ పాదయాత్రను పూర్తి చేశారు. ఇకపోతే నారా లోకేశ్ యువగళం పాదయాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జోరువానలోనూ వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చి లోకేశ్ పాదయాత్రలో భారీగా పాల్గొంటున్నారు.
Read More: Nara Lokesh : చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేస్తాం : నేతన్నలకు లోకేశ్ హామీ