మద్యం కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

మద్యం కంపెనీల అనుమతుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు మరికొందరిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2023-11-21 11:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మద్యం కంపెనీల అనుమతుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు మరికొందరిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా, నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఏ2 గా చేర్చింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అక్రమంగా కొన్ని మద్యం డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారంటూ సీఐడీ ఆరోపించింది. మరోవైపు దీంతో అటు కొల్లు రవీంద్ర ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఇరువురు పిటిషన్లపై మంగళవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపున సీనియర్ అడ్వకేట్ నాగ ముత్తు వాదనలు వినిపించారు. మద్యం కంపెనీలకు అనుమతుల సమయంలో ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదని కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వారు అప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నారని గుర్తు చేశారు. అయినా నాడు అభ్యంతరాలు చెప్పలేదని కానీ రాజకీయ కారణంతో కేసు నమోదు చేశారని నాగముత్తు హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రివిలేజ్ ఫీజు నిర్ణయం కూడా నిబంధనల ప్రకారమే తీసుకున్నారని వాదించారు. సీనియర్ అడ్వకేట్ నాగముత్తు వాదనల అనంతరం తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఇకపోతే బుధవారం సీఐడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.

Read More..

ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో సంచలన తీర్పు: ఆస్తుల జప్తునకు కోర్టు గ్రీన్ సిగ్నల్  

Tags:    

Similar News