ఆ రోజే కలెక్టరేట్ లో "జగనన్నకు చెబుదాం - స్పందన" కార్యక్రమం
ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించి వాటిని పరిష్కరించేందుకు ఈ నెల 26న సోమవారం ఉదయం 10.00గం.ల నుంచి "జగనన్నకు చెబుదాం - స్పందన" అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి తో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా యధావిధిగా నిర్వహిస్తున్న
దిశ, రాయచోటి: ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించి వాటిని పరిష్కరించేందుకు ఈ నెల 26న సోమవారం ఉదయం 10.00గం.ల నుంచి "జగనన్నకు చెబుదాం - స్పందన" అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి తో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్ లో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. ముఖ్యంగా.. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే స్పందనకు రాగలరని తెలిపారు. అలాగే స్పందన కార్యక్రమం ప్రారంభానికి ముందు సోమవారం ఉదయం 9.45 గంటలకు అధికారులతో స్పందన పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. స్పందనకు సంబంధించి ఎస్ఎల్ఎ పరిధి దాటిన దరఖాస్తులు అన్నింటిని వెంటనే పరిష్కరించి పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై కూడా సమీక్షిస్తామన్నారు. అధికారులతో సహా స్పందన లో పాల్గొనే ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.