రాహుల్ భారత ప్రధాని అయితేనే వైఎస్‌కు నిజమైన నివాళి: KVP
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ అనర్హత వేటుపై ఆ పార్టీ సీనియర్ నేత కేవీపీ రాంచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ అనర్హత వేటుపై ఆ పార్టీ సీనియర్ నేత కేవీపీ రాంచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్య రద్దుపై ప్రజా ప్రతినిధులు మాట్లాకడకపోవడం సిగ్గుచేటని కేవీపీ ధ్వజమెత్తారు. ఈ అంశంపై స్పందించని ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వారి పార్టీలను ఎందుకు బీజేపీలో విలీనం చేయడం లేదో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు.
బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తడానికి ఈ మూడు పార్టీలు తొందరపడుతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీ భారత ప్రధాని అయితేనే సీఎం జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. 2018లో తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ అనర్హత వేటుపై దేశవ్యాప్తంగా పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు స్పందించారు. అయినప్పటికీ సీఎం జగన్, చంద్రబాబు, పవన్ స్పందించకపోవడం గమనార్హం.