పిడుగుపడి 32 ప్రాణాలు బలి

వర్షాకాలం భారీ వరదలు, పిడుగులు పడే అవకాశం ఎక్కువ. ఈ నేపథ్యంలో పశు కాపరులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Update: 2024-08-19 15:13 GMT

దిశ బనగానపల్లి : వర్షాకాలం భారీ వరదలు, పిడుగులు పడే అవకాశం ఎక్కువ. ఈ నేపథ్యంలో పశు కాపరులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సోమవారం కురిసిన భారీ వర్షం నేపథ్యంలో పిడుగుపడి 32 జీవాలు మృతి చెందాయి. ఉపాధి చూపించే గొర్రెల మృతి చెందడంలో వాటి యజమాని ఎరుకల వెంకటేశ్వర్లు లబోదిబోమంటున్నారు. అవుకు మండలంలోని సంఘపట్నం గ్రామానికి చెందిన ఎరుకలి వెంకటేశ్వర్లు గొర్రెలను మేపేందుకు కొండకు వెళ్లగా అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. భారీ వర్షంలో పిడుగు పడటంతో 32 జీవాలు మరణించినట్లుగా బాధిత రైతు తెలిపాడు. ఈ సంఘటన తెలుసుకున్న అవుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఐవి ఉగ్రసేనారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రైతును పరామర్శించారు. మృతి చెందిన గొర్రెల విలువ దాదాపు మూడు లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేటట్లు చూస్తామని ఉగ్రసేనారెడ్డి గొర్రెల యజమానికి భరోసా కల్పించారు.

 


Similar News