AP News:ఇది నిజమైన ప్రజా ప్రభుత్వం.. ప్రభుత్వ విప్ కీలక వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు నాయకత్వం లోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.

Update: 2025-01-08 13:54 GMT

దిశ ప్రతినిధి,ఎన్టీఆర్ జిల్లా: సీఎం చంద్రబాబు నాయకత్వం లోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ పట్టణం కాకాని నగర్ కార్యాలయంలో ఒకేసారి 8 మంది లబ్దిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం 07 లక్షల 24 వేల 232 రూపాయల విలువైన చెక్కులను చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు, నందిగామ మండలం మరియు పట్టణంలోని లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూనే .. మరో పక్క హార్ట్, క్యాన్సర్, కిడ్నీ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడే నిరుపేద రోగులకు వైద్య ఖర్చుల భారం పడకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ ఫండ్ కింద నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. అంతే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ఆపరేషన్ నిమిత్తం సమయానికి ఎల్ఓసీలు అందజేస్తూ వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజల కష్టాల్లో అండగా నిలిచే నిజమైన మానవీయ ప్రభుత్వమని పేర్కొన్నారు.


Similar News