Ap News: పోలీసులకు జడ్జి షాక్.. ఆ జైలుకే Pattabhiram తరలింపు
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్ జైలుకు తరలించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్ జైలుకు తరలించారు. పట్టాభిరామ్‌ను జడ్జి ముందు ప్రవేశపెట్టగా మంగళశారం14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే జైలుకు తరలించే అంశంపై పోలీసులు ఆలోచనలో పడ్డారు. గన్నవరం సబ్‌జైలుకు కాకుండా వేరే జైలుకు తరలించాలని ప్లాన్ చేశారు.
గన్నవరం సబ్ జైలుకు పట్టాభిరామ్
ఇందులోభాగంగా బుధవారం నాడు పట్టాభిని పోలీసులు గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. అదే సందర్భంలో జీజీహెచ్ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదికను కూడా పోలీసులు జడ్జికి అందజేశారు. రిపోర్టును పరిశీలించిన తర్వాత పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా గన్నవరం సబ్ జైలుకు కాకుండా వేరే జైలుకు తరలించాలని పోలీసులు జడ్జిని కోరగా అందుకు తిరస్కరించారు. గన్నవరం సబ్ జైలుకు తరలించాలని ఆదేశించడంతో...పోలీసులు పట్టాభిని భారీ భద్రత నడుమ గన్నవరం సబ్ జైలుకు తరలించారు.