తిరువూరు టీడీపీకి భారీ షాక్... వైసీపీలో చేరిన స్వామి దాస్
ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి వైసీపలోకి వలసలు కొనసాగుతున్నాయి....
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ ఎన్టీఆర్ జిల్లాలో ఆసక్తి పరిణామాలు చేసుకుంటున్నాయి. నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జుల నియామకాలతో వైసీపీ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా తిరువూరు టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఇంచార్జి స్వామి దాస్ వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆయనకు జగన్ తిరువూరు వైసీపీ అభ్యర్థిగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు తిరువూరు వైసీపీ ఇంచార్జిగా స్వామి దాస్‌కు సీఎం జగన్ అవకాశం ఇవ్వడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో తన నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం.
కాగా ఇటీవల తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభ జరిగింది. ఈ సభ సందర్భంగా తిరువూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కేశినేని నాని, ఆయన తమ్ముడు చిన్ని వర్గీయులు ఘర్షణ పడ్డారు. దీంతో టీడీపీలో లుకలుకలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ మేరకు ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే వైసీపీలో చేరతానని స్పష్టం చేశారు. తాజాగా ఆయన అనుచరుడు స్వామి దాస్ కూడా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు