Janasena: కొడాలి నానిని వైసీపీ నుంచి బహిష్కరించాలి

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ డిమాండ్ చేశారు...

Update: 2023-05-29 10:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ డిమాండ్ చేశారు. కాపు సామాజిక వర్గాన్ని అవమానించేలా కొడాలి నాని వ్యాఖ్యలు చేశారని, తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో సోమవారం విలేకరులతో బాలాజీ మాట్లాడుతూ హద్దు అదుపు లేకుండా బూతులతో విరుచుకుపడుతున్నారని ధ్వజమెత్తారు. కాపులను దూషించినందుకు కాపు వర్గాలు, జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాయని బాలాజీ అన్నారు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే బహిరంగంగా కాపులను కులం పేరుతో బూతులు తిట్టడం ఎంతవరకు సమంజసమని బాలాజీ ప్రశ్నించారు. రంగా విగ్రహాలకు దండలు వేసి, రంగా కుమారుడితో మాట్లాడితే సరిపోదని, సాటివారిని గౌరవించడం తెలుసుకోవాలని బాలాజీ అన్నారు.

సంస్కారం లేకుండా మాట్లాడిన కొడాలి నానిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బాలాజీ డిమాండ్ చేశారు. కొడాలి నాని మాటలకు వైసీపీలోని కాపు నాయకులు పెదవి విప్పి కాపు సమాజానికి సమాధానం చెప్పాలని కూడా బాలాజీ డిమాండ్ చేశారు. సంస్కారం లేని, సభ్యత లేని శాసనసభ్యులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు అడుగు వేయలేదని బాలాజీ హెచ్చరించారు. తక్షణమే వైఎస్ జగన్ కొడాలి నానితో కాపు వర్గానికి క్షమాపణ చెప్పించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా కాపు వర్గాలన్నీ కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతాయని బాలాజీ హెచ్చరించారు. తక్షణమే కొడాలి నానిపై బేషరతుగా పోలీసులు సుమోటోగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా బాలాజీ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

‘జూ.ఎన్టీఆర్‌ను నాశనం చేయాలని చంద్రబాబు ప్లాన్’  

Tags:    

Similar News