ఏపీ సీఎంగా మరోసారి జగన్.. ఆ నెలలోనే ప్రమాణ స్వీకారం..!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఏపీ సీఎం అవుతారని, మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.,,,

Update: 2024-02-23 14:35 GMT
CM Jagan Extends Raksha Bandhan Wishes to People of AP
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఏపీ సీఎం అవుతారని, మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు జగన్‌ను ఆపగలిగే శక్తి ఏ నాయకుడికీ లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకూ సీఎం జగన్ 120 సార్లు బటన్లు నొక్కి ప్రజలకు డబ్బులు అందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కారమ్యే వ్యవస్థను జగన్ సృష్టించారని కొడాలి నాని తెలిపారు.


ఏపీకి రాజధానిగా విశాఖ కరెక్ట్ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. రాజధాని కడతానని చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని ఆరోపించారు. రాజధాని పేరుతో 33 వేల ఎకరాల భూమిని తీసుకుని చంద్రబాబు పిట్టల దొరల్లా సొల్లు కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి రాజధానుల్లో ప్రభుత్వ కార్యాలయాలు 150 ఎకరాల్లో ఉంటాయన్నారు. దేశంలో ఏ రాజధాని తీసుకున్న వంద ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయని చెప్పారు. అసలు పొలాల్లో రాజధాని ఎలా కడతారని ప్రశ్నించారు. రాజధాని కడతానని చంద్రబాబు వాస్తవాలకు దూరంగా మాట్లాడుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. 

Tags:    

Similar News