Varahi Yatra: ఇళ్ల పేరుతో భారీ స్కాం.. లెక్కలతో సహా గుట్టు రట్టు చేసిన పవన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ..
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వారాహి యాత్రను అడ్డుకునేందుకు జరుగుతున్న పరిణామాలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ సర్కార్‌కు పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని ఆయన సెటైర్లు వేశారు. వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల కోసం పథకాలు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీకి రావాలంటే పోస్ పోర్టు తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. నిధులు మళ్లింపులో ఏపీదే అగ్రస్థానమని కేంద్రం చెబుతోందన్నారు. ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన నిధులు రూ.336 కోట్లు దారి మళ్లించారని పవన్ ఆరోపించారు. ఇళ్ల పేరుతో రూ.4 వేల కోట్లు దోచుకున్నారన్నారు. వైసీపీ గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు టీడీపీ, జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులకు భయపడే వాళ్లు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలంతా ఒక్కటి కావాలని పిలుపు నిచ్చారు. రాజకీయ నాయకుల విభేదాలు పాలసీల వరకే పరిమాతం కావాలని పవన్ కల్యాణ్ సూచించారు.