Gannavaram: వైసీపీలోనే దుట్టా.. ఎంపీ బాలశౌరి ఎంట్రీతో మారిన సీన్...!

గన్నవరం రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ..

Update: 2023-08-26 10:25 GMT

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో దుట్టా వర్గం గుర్రుగా ఉంది. టీడీపీ నుంచి వచ్చిన వంశీకి సీటు ఇస్తే గన్నవరం నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న తమ పరిస్థితేంటంటూ దుట్టా, యార్లగడ్డ వెంకట్రావు కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా అధిష్టానం స్పందించకపోవడంతో  యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అనంతరం టీడీపీలో చేరిపోయారు. దీంతో గన్నవరం టీడీపీ ఇంచార్జి బాధ్యతలు యార్లగడ్డకు అప్పగించారు.

అయితే దుట్టా రామచంద్రారావు కూడా పక్క చూపులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అధిష్టానం అప్రమత్తమైంది. నష్ట నివారణ చర్యలకు దిగింది. దుట్టాను బుజ్జగించేందుకు యత్నాలు ప్రారంభించింది. ఎలాగైనా సరే దుట్టాను వైసీపీలోనే కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని రంగంలోకి దింపింది. దుట్టాను కలిసి బుజ్జిగించే బాధ్యతలను ఆయనకు అప్పగించింది. దీంతో గన్నవరంలోని దుట్టా రామచంద్రరావు ఇంటికి ఎంపీ బాలశౌరి వెళ్లారు. దుట్టాతో భేటీ అయి పార్టీలోనే కొనసాగాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో తమకిచ్చే ప్రాధాన్యతను తగ్గించమని దుట్టాకు నచ్చ జెప్పారట. దీంతో దుట్టా చల్లబడినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఎంపీ బాలశౌరి చూపిన చొరవతో దుట్టా పార్టీ మార్పుపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. 

Tags:    

Similar News