Cm Jagan Challenge: ఆ దమ్ముందా.. చంద్రబాబు?

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ మోహన్‌రెడ్డి పర్యటించారు.....

Update: 2023-03-19 11:31 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ మోహన్‌రెడ్డి పర్యటించారు. జగనన్న విద్యాదీవెన పథకం నిధులు విడదల చేశారు. బటన్ నొక్కి 10 లక్షల 85 వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు.

ఈ సందర్భగా సీఎం జగన్ మాట్లాడుతూ గత సీఎం చంద్రబాబు ఎగ్గొట్టిన ఫీజు బకాయిలను సైతం చెల్లించామని చెప్పారు. ఫీజులు మాత్రమే కాదు వసతి ఖర్చులు కూడా ఇస్తున్నామని జగన్ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 11న రెండో విడత వసతి దీవెన నిధులు చెల్లిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల చదువుల బాధ్యత తనదని తెలిపారు. 8 తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నామని చెప్పారు. రెండేళ్లు టైమ్ ఇస్తే సర్కారీ బడులను కార్పొరేట్ స్కూళ్లుగా మార్చుతామన్నారు. దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని, చంద్రబాబు, పవన్‌ను ఉద్దేశించి విమర్శించారు. తోడెళ్లన్నీ ఏకమవుతున్నాయని, పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ సందర్భంగా సీఎం జగన్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని సీఎం జగన్ వెల్లడించారు.

Tags:    

Similar News