Vijayawada: దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్

దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రిని సందర్శించారు....

Update: 2023-10-20 10:42 GMT

దిశ, వెబ్ డెస్క్: దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రిని సందర్శించారు. నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు కావడంతో కనకదుర్గమ్మను దర్శించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేద మంత్రాల ఉచ్చారణతో సీఎం జగన్‌ను అర్చకులు, పండితులు ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డిని అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.  ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

కాగా దసరా శరన్నవాత్రి వేడుకలు ఇంద్రకీలాద్రిలో వైభవంగా సాగుతున్నాయి. దుర్గమ్మదేవి ఇవాళ సరస్వతీ దేవీ రూపంలో దర్శనమిస్తున్నారు. దీంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. శని, ఆదివారాల్లో భక్తులు మరింతగా పోటెత్తే అవకాశం ఉండటంతో రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్ల విక్రయాలను అధికారులు నిలిపివేశారు.

Tags:    

Similar News