Skill Case: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు సాగాయి. ..

Update: 2023-09-27 11:42 GMT

దిశ, వెబ్ డెస్క్:  స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు సాగాయి. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపున లాయర్లు వాదనలు వినిపించారు. చంద్రబాబును మరింతగా ప్రశ్నించేందుకు కస్టడీకి ఇవ్వాలని అటు సీఐడీ తరపున కూడా న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది. అంతేకాదు చంద్రబాబు, సీఐడీ పిటిషన్లపై తీర్పు కూడా అప్పుడే వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది

కాగా చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. రెండోసారి కూడా రిమాండ్ విధించడంతో 19 రోజులుగా జైల్లోనే ఉన్నారు. దీంతో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోంది. మరోవైపు ఏపీ హైకోర్టు కొట్టివేసిన క్వాష్ పిటిషన్‌‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే అక్కడ కూడా విచారణ వాయిదా పడింది. దీంతో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

Read More Latest updates of Andhra Pradesh News

Tags:    

Similar News