మరింత దూకుడు పెంచిన పురంధేశ్వరి.. సీఎం జగన్‌కు కీలక డిమాండ్

ఏపీలో మద్యం ఎవరు తయారు చేస్తున్నారని.. ఆ కంపెనీల యజమానుల పేర్లు బయటపెట్టాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. ..

Update: 2023-10-14 10:51 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం ఆదాయంలో అవకతవకలు జరుగుతున్నాయని, వైసీపీ నేతల జేబుల్లోకి డబ్బులు వెళ్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై నిరసనలు వ్యక్తం చేసిన ఆమె మరింత దూకుడు పెంచారు. ఇప్పుడు ఏకంగా మద్యం చేస్తున్న కంపెనీల యజమానుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేస్తు్న్నారు. ఇదే అంశంపై విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. అసలు ఏపీలో మద్యం ఎవరు తయారు చేస్తున్నారని.. ఆ కంపెనీల యజమానుల పేర్లు బయటపెట్టాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. ఆ కంపెనీల యాజమానులంతా వైసీపీకి చెందిన వారేనని ఆరోపించారు. ధైర్యం ఉంటే మద్యం కంపెనీల యాజమానుల పేర్లు వెంటనే ప్రజలక్షేత్రంలో ఉంచాలని ఆమె సవాల్ విసిరారు. ఏపీ మద్యం తయారు చేసినా.. అమ్మినా ఏడేళ్ల పాటు జైలులో ఉంచాలని గతంలో వైఎస్ జగన్ చెప్పిన మాటలను పురంధేశ్వరి గుర్తు చేశారు.

Tags:    

Similar News