Ap Governor 'ఎట్ హోమ్' కార్యక్రమం.. హాజరుకాని చంద్రబాబు, పవన్
ఏపీ రాజ్ భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది...
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజ్ భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులు, వైసీపీ నేతలు హాజరయ్యారు. ప్రతిపక్ష నాయకులెవరూ కార్యక్రమంలో పాల్గొనలేదు. ప్రతీ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహిస్తారు. అన్ని పార్టీల నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. ఈ ఏడాది కూడా ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గైర్హాజరయ్యారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా హాజరుకాలేదని తెలుస్తోంది. ఇందుకు కారణం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలనేనని సమాచారం.
కాగా చంద్రబాబు సభల్లో జరిగిన ప్రమాదాల కారణంగా ఇటీవల కాలంలో సీఎం జగన్ జీవో నెం.1 విడుదల చేశారు. రాష్ట్రంలో సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలకు పోలీసుల అనుమతి తప్పని సరి చేస్తూ పలు షరతులు విధించారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష సభలకు మాత్రం అనుమతి నిరాకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని టీడీపీ నేతలు గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే సానుకూల స్పందన రాకపోవడం వల్లే గవర్నర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి ఆ పార్టీల నాయకులు హాజరుకాలేదని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: Pawan Kalyan జెండా ఆవిష్కరణపై ట్రోల్స్.. వివరణ ఇచ్చిన Janasena