Srisailam Reservoir:నిండు కుండలా శ్రీశైలం జలాశయం..మళ్లీ గేట్ల ఎత్తివేత
దిశ, డైనమిక్ బ్యూరో:శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా క్రమ క్రమంగా కృష్ణానదికి వరదలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆది, సోమ, మంగళవారాల్లో భారీ వర్షం కారణంగా జూరాలకు వరద పోటెత్తింది. దీంతో 24 గేట్లను ఎత్తిన అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈకారణంగా శ్రీశైలం జలాశయానికి వరద పోటేత్తి నిండుకుండాలా ఉంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు రేడియల్ క్రెస్ట్ గేట్లను 10 అడుగుల ఎత్తు వరకు ఎత్తి నాగార్జునసాగర్ డ్యామ్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సంవత్సరంలో గేట్లు ఎత్తడం ఇది రెండోసారి. శ్రీశైలం ఇన్ ఫ్లో 2,13,624 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,22,876 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 885 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు, ప్రస్తుతం 215.8070 టీఎంసీలు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
More News : Nagarjuna Sagar : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గని కృష్ణమ్మ వరద