కోడికత్తి కేసులో కీలక పరిణామం: వైఎస్ జగన్ హాజరుకావాల్సిందేనా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2023-08-01 09:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను విజయవాడ ఎన్ఐఏ కోర్టు విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కోడికత్తి కేసులో వాద ప్రతివాదనలు విశాఖ ఎన్ఐఏ కోర్టులో జరుగుతుందని కోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది. ఈ కోడికత్తి కేసులో 80శాతం ట్రయల్స్ పూర్తి అయిన తర్వాత మరో కోర్టుకు బదిలీ చేయడంపై నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తరఫు న్యాయవాది గగన సింధు అన్నారు. ఇప్పటికే నాలుగు సంవత్సరాల 5 నెలలుగా శ్రీనివాసరావు జైల్లోనే మగ్గుతున్నాడని చెప్పుకొచ్చారు. ఈ కేసు విషయంలో వైఎస్ జగన్ కోర్టుకు హాజరుకావాల్సిందేనని చెప్పుకొచ్చారు. కేసు కొలిక్కిరావాలంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందేనని అన్నారు. ఈ కోడికత్తి కేసును తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదని...పూర్తి స్థాయిలో తమ వాదనలు వినిపిస్తామని న్యాయవాది గగన సింధు తెలిపారు. 

Read More : ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంది: YS Jagan Mohan Reddy 

Tags:    

Similar News