కుక్కను కాల్చినట్లు కాల్చేస్తారు.. పవన్ కల్యాణ్‌పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వం వేర్పాటు ధోరణి ప్రదర్శిస్తే.. తనలాంటి ఉగ్రవాదిని ఇంకోకరిని చూడరని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం వేర్పాటు ధోరణి ప్రదర్శిస్తే.. తనలాంటి ఉగ్రవాదిని ఇంకోకరిని చూడరని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తీవ్రవాదిలా మారితే కుక్కను కాల్చినట్లు కాల్చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే పవన్ ప్రజలను చంపేస్తాడా అని ప్రశ్నించారు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండేందుకే 3 ప్రాంతాల అభివృద్ధి విధానమని తెలిపారు.
పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని అని నిప్పులు చెరిగారు. మాకు ఇప్పటికి 55 శాతం ఓటు బ్యాంక్ ఉందని.. అందరూ కలిసి వచ్చినా మా వెంట్రుక కూడా పీకలేరని షాకింగ్ కామెంట్స్ చేశారు. యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టినా టీడీపీ యువనేత లోకేష్‌పై కొడాలి నాని సెటైర్లు వేశారు. స్విమ్మింగ్ ఫూల్లో ఫారిన్ అమ్మాయిలతో కలిసి మందు తాగటమే అభివృద్ధా అని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని చేసినా బతికున్నంతా కాలం ఈ రాష్ట్రానికి జగనే సీఎం అని ధీమా వ్యక్తం చేశారు. 420 చంద్రబాబు.. 210 లోకేష్ పాదయాత్ర చేసినా.. పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.