మూడు పార్టీల గుండెచప్పుడు ఒకటే.. ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-18 13:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుధవారం సాయంత్రం మంగళగిరిలో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం సీకే కన్వెన్షన్‌లో జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి సీఎ చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించగా, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ 100 రోజుల పాలన పై చర్చ జరిగింది. కాగా అనంతరం ఈ సమావేశంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంలో ఉన్న కూటమిలోని పార్టీలు వేరైనప్పటి.. మనం వేర్వేరు కాదని.. మూడు విభిన్నమైన పార్టీలు అయినప్పటికి, ఆత్మ ఒక్కటేనని.. మూడు పార్టీల గుండెచప్పుడు ఒకటేనని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు..

అలాగే వరద సమయంలో సీఎం చంద్రబాబు పడిన కష్టం మామూలు విషయం కాదని.. మందకొడిగా ఉన్న అధికారులను అంకుశం పెట్టి పొడవాల్సి ఉందని..ఈ వయస్సులో కూడా వరదల్లో కష్టపడుతున్న చంద్రబాబును విమర్శిస్తుంటే తనకు బాధేస్తోందన్నారు. కాగా ఏపీలో 100 రోజుల కూటమి పాలనలో పీఆర్ అండ్ ఆర్డీ శాఖలో ప్రగతి సాధించామని.. పంచాయతీలను బలోపేతం చేయగలిగామని.. మొత్తం అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించగలిగినట్లు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శాసనసభాపక్ష సమావేశంలో చెప్పుకొచ్చారు.


Similar News