Tirumala:తిరుమలలో మోస్తరు వర్షం.. టీటీడీ అధికారులు కీలక సూచనలు
తిరుమలలో గురువారం ఉదయం నుంచి మోస్తారు వర్షం కురిసింది.
దిశ, తిరుమల: తిరుమలలో గురువారం ఉదయం నుంచి మోస్తరు వర్షం కురిసింది. శ్రీవారి ఆలయం, నాలుగు మాడ వీధులు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వైకుంఠం క్యూ లైన్లలో భక్తులు వర్షంలో తడుచుకుంటూ స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం టిటిడి ఏర్పాటు చేసిన షెడ్లలో తలదాచుకున్నారు. రోడ్లు అంత జలమయమయ్యాయి. వర్షం కారణంగా ఘాట్ రోడ్డులో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని టీటీడీ అధికారులు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు.