Home Minister Anitha:హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీ హోం మినిస్టర్ అనిత(AP Home Minister Anitha) మాజీ సీఎం జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-07 14:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హోం మినిస్టర్ అనిత(AP Home Minister Anitha) మాజీ సీఎం జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తల్లిని, చెల్లిని అవమానిస్తూ పోస్టులు చేస్తే జగన్‌కు ఏమీ అనిపించకపోవచ్చని, కానీ తనకు రక్తం మరుగుతోందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆడబిడ్డలపై తప్పుడు పోస్టులు చేస్తే సప్త సముద్రాలు ఆవల ఉన్నా పట్టుకుంటామని హెచ్చరించారు. తల్లి, చెల్లి గురించి తప్పుగా మాట్లాడితే కాళ్లు, చేతులు పనిచేయని వారికైన కోపం వస్తుందని.. జగన్‌కు జాలి, దయ అనే పదాలకు అర్థం తెలియకనే పౌరుషం రావట్లేదని హోం మంత్రి అనిత విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే ఎవ్వరినీ వదిలిపెట్టి బోమని వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన చట్టం తీసుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఘటనలోనైనా 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో పోలీసులు తలెత్తుకునేలా, నేరస్థుడు భయపడేలా చేస్తామని హోం మంత్రి అనిత వెల్లడించారు.

Tags:    

Similar News