AP Cabinet : అదానీ విద్యుత్తు ఒప్పందంపై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ

సీఎం చంద్రబాబు(CM Chandrababu)అధ్యక్షతన ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ (AP Cabinet )సమావేశంలో అదానీ విద్యుత్తు ఒప్పందం(Adani power deal) కీలక చర్చ(Key discussion)కొనసాగిస్తోంది.

Update: 2024-12-03 07:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు(CM Chandrababu)అధ్యక్షతన ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ (AP Cabinet )సమావేశంలో అదానీ విద్యుత్తు ఒప్పందం(Adani power deal) కీలక చర్చ(Key discussion)కొనసాగిస్తోంది. సెకీ ఒప్పందంపై ఏ చర్యలు తీసుకోవాలనే అంశంపై కేబినెట్ చర్చ సాగుతోండగా అదానీ పవర్‌పై నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్‌ని పెండింగ్‌లో పెట్టే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అదానీ విద్యుత్ ఒప్పందం కారణంగా రూ. 1750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు అమెరికాలో కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. సెకీ ఒప్పందం పూర్తి వివరాలను కేబినెట్‌లో చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు వివరించారు.

విద్యుత్తు ధరలు తగ్గించకపోతే ఒప్పందాన్ని రద్దు చేసుకుని పెనాల్టీ చెల్లించడమే ఉత్తమమని కేబినెట్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఒప్పందం రద్దు చేసుకుంటే పెనాల్టీగా రూ. 2100 చెల్లించాల్సింది ఉంటుందని, దీంతో కేబినెట్ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్నది ఆసక్తికరంగా మారింది. అటు కేబినెట్ భేటీలో సీఆర్డీఏ ఆమోదించిన 23 అంశాలకు ఆమోదం తెలపడంతో పాటు కాకినాడ పోర్ట్‌ అంశంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పలు ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, డీపీఆర్‌లపైన, సోషల్ మీడియా వేధింపుల కేసులు, భవిష్యత్ కార్యాచరణపై కేబినెల్ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. 

Tags:    

Similar News