ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రూ. 99 కే నాణ్యమైన మద్యం

అమరావతిలోని సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.

Update: 2024-09-18 10:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమరావతిలోని సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో నూతన మద్యం పాలసీ, వాలంటీర్ వ్యవస్తపై సుదీర్ఘ చర్చ జరిగింది. అలాగే మరికొన్ని అంశాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించారు. చివరకు ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇందులో కొత్తం మద్యం పాలసీకి ఆమోదం తెలిపింది. అలాగే నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని, సగటున మద్యం ధర రూ. 99 గా(క్వాటర్) ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కేబినెట్‌ నిర్ణయం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. వంద లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి రావడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లురి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించారు. కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా.. వాలంటీర్ వ్యవస్తపై సూదీర్ఘంగా చర్చ, బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌‌పై కూడా చర్చించిన కేబినెట్.. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Similar News