అలా అయితే కూటమిలోకి ఎవరొచ్చినా ఓకే.. చేరికలపై కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు

కూటమిలో చేరికలపై కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమిలోకి ఏ పార్టీ లీడర్లు వచ్చినా ఆహ్వానిస్తామని ప్రకటించారు.

Update: 2024-08-28 11:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: కూటమిలో చేరికలపై కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమిలోకి ఏ పార్టీ లీడర్లు వచ్చినా ఆహ్వానిస్తామని ప్రకటించారు. తప్పకుండా పదవికి రాజీనామా చేసే రావాలని ఆహ్వానించారు. అంతకుముందు ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కేంద్రం మంజూరు చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్ - బెంగళూరు, విశాఖ - చెన్నై మీదుగా కారిడార్లు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కొప్పర్తి విశాఖ-చెన్నై కారిడార్ కిందకు వస్తుందని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,137 కోట్లు ఖర్చు చేయబోతోందని తెలిపారు. దీంతో దాదాపు 54,500 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అన్నారు. అంతేకాదు.. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. దాదాపు రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని గుర్తుచేశారు.


Similar News