‘అవ్వ, తాతలకు ఇబ్బంది’.. ఈసీ నిర్ణయంపై మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు
ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయించవద్దని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఈసీ ప్రభుత్వానికి సూచించింది. వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించడంపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల పేరుతో పింఛన్ పంపిణీ చేయకపోవడం వల్ల అవ్వ, తాతలు ఇబ్బంది పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కక్షపూరిత పనులతో ఇబ్బంది పడేది వాలంటీర్లు కాదు లబ్ధిదారులని విమర్శించారు. వాలంటీర్లపై ఆంక్షల నిర్ణయంపై ఎన్నికల కమిషన్ పునరాలోచించాలని విజ్ఙప్తి చేశారు.